రీ కౌంటింగ్‌లో జోబైడెన్‌ గెలుపు

– డబ్ల్యూహెచ్‌వో చేరుతాం:జోబైడెన్‌

వాషింగ్టన్‌,నవంబరు 20(జనంసాక్షి):అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జార్జియా పోరు ఆసక్తికరంగా సాగింది. ఇక్కడ ఆది నుంచి రిపబ్లికన్‌ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య గెలుపు దోబూచులాడుతూ వచ్చింది. చివరకు బైడెన్‌ అత్యల్ప మెజార్టీతో విజయం సాధించడంతో రీకౌంటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే రీకౌంటింగ్‌లోనూ గెలుపు బైడెన్‌నే వరించింది. రీకౌంటింగ్‌కు ముందు బైడెన్‌, ట్రంప్‌ మధ్య తేడా దాదాపు 14వేలు ఉండగా.. పునఃలెక్కింపు తర్వాత డెమొక్రాటిక్‌ నేత 12,284 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు జార్జియా ఉన్నత ఎన్నికల అధికారి వెల్లడించారు. రిపబ్లికన్లకు గట్టి పట్టున్న జార్జియా రాష్ట్రంలో 28ఏళ్ల తర్వాత ఓ డెమొక్రాటిక్‌ నేత విజయం సాధించడం ఇదే విశేషం. చివరిసారిగా 1992లో అప్పటి అధ్యక్ష అభ్యర్థి, డెమొక్రాటిక్‌ నేత బిల్‌ క్లింటన్‌ ఇక్కడ గెలుపొందారు. ఆ తర్వాత నుంచి జార్జియాలో రిపబ్లికన్లే ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ నేత హిల్లరీ క్లింటన్‌, రిపబ్లికన్‌ ట్రంప్‌ మధ్య ¬రా¬రీ పోరు జరగ్గా.. చివరకు హిల్లరీపై ట్రంప్‌ కేవలం 5శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ట్రంప్‌, బైడెన్‌ మధ్య ఓట్ల మార్జిన్‌ 1 శాతం కంటే తక్కువగా ఉండటంతో ఇక్కడ రీకౌంటింగ్‌ జరపాల్సి వచ్చింది. జార్జియాలో 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. తాజా ఫలితంలో బైడెన్‌ ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్య 306కు పెరగ్గా.. ట్రంప్‌ 232 ఎలక్టోరల్‌ ఓట్లతో ఓటమిని చవిచూశారు.అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయం సాధించినట్లు నవంబరు 7న అమెరికా ప్రధాన విూడియా సంస్థలన్నీ ప్రకటించాయి. అయితే ట్రంప్‌ మాత్రం ఇంతవరకూ తన ఓటమిని ఒప్పుకోకపోవడం గమనార్హం. ఎన్నికల్లో మోసాలు జరిగాయని గత కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తున్న ట్రంప్‌ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. అంతేగాక, బైడెన్‌తో అధికార మార్పిడికి కూడా ససేమిరా అంటున్నారు.అమెరికా తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)లో చేరుతుందని ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికైన జోబైడెన్‌ ప్రకటించారు. అలాగే సంస్థలోని సభ్య దేశం చైనా నిబంధనల ప్రకారం నడుచుకుంటుందో లేదో తాను నిర్ధారించుకోవాలనుకుంటున్నాని వెల్లడించారు. ఎన్నికల సమయంలో అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో భాగంగా చైనా గురించి బైడెన్‌ చేసిన ప్రకటనలనుద్దేశించి ప్రశ్నించగా ఈ విధంగా సమాధానమిచ్చారు. కాగా, కరోనా వైరస్‌పై సరైన సమాచారం ఇవ్వలేదని, ఆ దేశం చెప్పినట్లు ఆరోగ్య సంస్థ నడుచుకుంటుందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ సంస్థతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘చైనాను శిక్షించడం విషయం కాదు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆ దేశం అర్థం చేసుకొనేలా చూసుకోవడం ముఖ్యం. అది చాలా సాధారణమైన ప్రతిపాదన. మేము మొదటి రోజే సంస్థలో తిరిగి చేరబోతున్నాం. అలాగే దానిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పారిస్‌ వాతావరణ ఒప్పందంలో కూడా తిరిగి చేరతాం. మనం, మిగతా ప్రపంచం కలిసే ఉన్నామనే విషయాన్ని చాటాలి’ అని గవర్నర్లతో జరిగిన సమావేశంలో బైడెన్‌ స్పష్టం చేశారు. కాగా, డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అమెరికా, చైనా సంబంధాలు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి. వాణిజ్య యుద్ధం, కరోనా వైరస్‌ ఇరు దేశాల మధ్య ప్రధాన సమస్యలుగా మారాయి. కరోనాను ‘చైనా వైరస్‌’ అంటూ ట్రంప్‌ పలుమార్లు ఆదేశం