రుణ పరిమితి పెంచండి

Untitled-2– జాతీయ రహదారులను విస్తరించండి
– కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, గడ్కరీలతో సీఎం కేసీఆర్‌ భేటి
న్యూఢిల్లీ,అక్టోబర్‌27(జనంసాక్షి): తెలంగాణకు రుణపరిమితిని పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కోరారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌ మంగళవారం జైట్లీతో సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లాలకు, కరవు మండలాలకు నిధులు కేటాయించాలని కేసీఆర్‌.. కేంద్ర మంత్రిని కోరారు.  ఎఫ్‌ఆర్‌బీఎం పెంపు, కేంద్ర సాయం, కేంద్ర పథకాల్లో వాటా అంశంపై అరుణ్‌జైట్లీతో కేసీఆర్‌ చర్చించారు. సమావేశం అనంతరం అరుణ్‌జైట్లీ విూడియాతో మాట్లాడుతూ… నిధుల పెంపు, పన్ను మినహాయింపుల గురించి కేసీఆర్‌ చర్చించారని, సాధ్యాసాధ్యాలపై శాఖాపరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ద్రవ్య సంస్థల రుణ పరిమితిని పెంచాలని కోరారని వెల్లడించారు. దీన్ని ఆర్థికశాఖ వినిమయ విభాగానికి పంపామని తెలిపారు. ఇరువురి సమావేశం సంతోషకరమైన వాతావరణంలో కొనసాగిందని పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సవరించాలి…విదేశాల నుంచి ఎక్కువ రుణం పొందేలా చూడాలని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కేసీఆర్‌ కోరారని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. హెచ్‌ఎండీఏపై కేంద్ర పన్నులను మినహాయించాలని కోరామన్నారు. ఏడు కరువు జిల్లాలకు నిధులు కేటాయించడంతో పాటు మిషన్‌ కాకతీయ, ఇతర పథకాలకు సాయం చేయాలని కేసీఆర్‌ కేంద్రాన్ని కోరినట్లు వేణుగోపాలాచారి తెలిపారు.  విజ్ఞప్తులను మరోసారి అరుణ్‌జైట్లీ దృష్టికి తెచ్చినట్లు వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని పెంచాలని సీఎం కోరారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి జైట్లీకి వివరించినట్లు చెప్పారు. మిషన్‌ కాకతీయ పథకానికి నిధులు ఇవ్వాలని, వాటర్‌గ్రిడ్‌ పథకానికి అదనపు నిధులు ఇవ్వాలని, హెచ్‌ఎండీఏకు ఆదాయపన్ను మినహయించాలని సీఎం కోరారని తెలిపారు. కరవు మండలాల గురించి అరుణ్‌జైట్లీ సీఎం వివరించినట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌ వెంట ఉన్నారు.  తమ ప్రతిపాదనలకు జైట్లీ సానుకూలంగా స్పందించారని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్‌.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలవనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, రాష్ట్ర పథకాలకు నిధులు కేటాయించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా రాష్ట్రానికి రుణ పరిమితి పెంపుతోపాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

గడ్కరీతో సిఎం కెసిఆర్‌ భేటీ

దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. తెలంగాణకు మంజూరు కావాల్సిన ప్రాజెక్టులు, అందాల్సిన నిధులపై చర్చించారు. ఆయన వెంట తెలంగాణ ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వినోద్‌ తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ… రాష్ట్రంలో దశల వారీగా 4వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను విస్తరణ చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ జాతీయ రహదార్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఏటూరునాగారం-కౌతాల మధ్య జాతీయ రహదారి నిర్మించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ రహదారుల ఏర్పాటుకు గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఎంపీ వినోద్‌ మాట్లాడుతూ తెలిపిన వివరాలు… రాష్ట్రంలో నాలుగు వేల కిలోవిూటర్ల రహదారులు అవసరమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని సీఎం కోరారు. 13 వందల కిలో విూటర్ల రహదారి నిర్మాణానికి త్వరలోనే గెజిట్‌ విడుదల కానున్నట్టు గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన రోడ్ల విస్తరణ లేదని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ ఉపరితల రవాణాశాఖ నుంచి కేంద్రానికి పంపిన అన్ని లేఖలపై వివరంగా సీఎం చర్చించారు. డ్రైపోర్టు, అన్ని జిల్లాల్లో జాతీయ రహదారుల విస్తరణ జరిగేలా చూడాలని సీఎం కోరారు. ఏటూరు నాగారం నుంచి కౌటాల వరకు జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని కోరారు. ఇన్‌ల్యాండ్‌ వాటర్‌, డ్రైపోర్టు ఏర్పాటుకు అవసరమైన నిధులను విడుదల చేస్తామని గడ్కరీ హావిూ ఇచ్చారు. ఇంకా పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన రహదారులు ఇస్తామని గడ్కరీ చెప్పారు.