రుద్రూర్ గోశాల లో ఔషధ మొక్కల దినోత్సవం

 

రుద్రూర్ (జనంసాక్షి):
ఆధునిక ఆయుర్వేద శిరోమణి ఆచార్య బాలకృష్ణ (హరిద్వార్) 50వ స్వర్ణ జయంతి ఉత్సవాలను పతంజలి యజ్ఞ సహిత యోగ సమితి సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఆగస్టు 4 వ తేదీన ఔషధ మొక్కల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంద తెలిపారు . ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున స్వర్గీయ దేవి దాసు రావు గోశాల యందు ఉదయం 5:30 నిమిషాల నుండి 7:30 నిమిషాల వరకు యజ్ఞం , యోగ సాధన మరియు వివిధ రకాల ఔషధ మొక్కలను నాటడం జరిగింది . ఈ సందర్భంగా పతంజలి యజ్ఞ సహిత యోగ సమితి సభ్యుల మాట్లాడుతూ ఆచార్య బాలకృష్ణ కొన్ని లక్షల ఆయుర్వేద మొక్కలపై పరిశోధనలు చేశరని. అంతే కాకుండా అనేక రకాల ప్రాణాంతక వ్యాధులను సైతం కాపాడే శక్తి ఆయుర్వేద వన మూలికలలో ఉందని ఆయన ప్రపంచానికి చాటిచెప్పారని అందుకే, వారి జన్మదినం సందర్భంగా తిప్పతీగను (సంస్కృతంలో అమృతవల్లి) (గిలోయ్ )50 మొక్కలను రుద్రూర్ గ్రామ ప్రజలకు వితరణ చేయడం జరిగిందని మరియు గోశాల పరిసర ప్రాంతాలలో వివిధ రకాల ఔషధ మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ మహాజన్, రుద్రూర్ మండల అధ్యక్షుడు పుట్టి శ్రీనివాస్, యువ భారత అధ్యక్షులు సతీష్ గౌడ్ , కె.వి మోహన్ , లక్ష్మీ నరసయ్య ,పురుషోత్తం ,గోనశంకర్ ,పుట్టి ప్రకాష్ ,శివ కుమార్, ప్రశాంత్ గౌడ్, గో సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.