రుషికొండ పర్యావరణ ఉల్లంఘనల కేసు
కేసులో ఇంప్లీడ్ అయిన ఎంపి రఘురామ
విచారణను 27కు వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి,జూలై19(జనం సాక్షి): విశాఖ రుషికొండ పర్యావరణ ఉల్లంఘనలపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. రుషికొండ వ్యవహారాల కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేశారు.ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో 2 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు సూచనల మేరకు రఘురామ పిటీషన్‌ను అనుమతించాలని న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టులో వాదించారు. ఉమేష్ చంద్ర వాదనలను పరిగణలోకి తీసుకుని రఘురామరాజు పిటీషన్‌ను సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అనుమతినిచ్చింది. రఘురామరాజు తరపున రుషికొండ పర్యావరణ ఉల్లంఘనలపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. రఘురామ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీజే నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రుషికొండ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 27కి హైకోర్టు వాయిదా వేసింది.