రూ. లక్ష కోట్లు కేటాయిస్తాం… సొంతింటి కల నెరవేరుతుంది: వెంకయ్య నాయుడు

 venkaiah
 భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆవాస్ యోజన, అమృత్ పథకాలు అమల్లోకి వస్తే ప్రతి భారతీయుడి సొంతింటి కల నెరవేరుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన అటల్ పట్టణ రూపాంతరీకరణ, పునరుజ్జీవన పథకాల (అమృత్) ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగిస్తూ… భారత్‌ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు ఓ మహత్తర యజ్ఞం మొదలైందని అన్నారు. 
ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అమృత్ పథకాలు అమల్లోకి వస్తే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఏర్పడుతుందని, తద్వారా పట్టణాలు మరింత ప్రగతితో దూసుకెళ్తాయని వెంకయ్య వివరించారు. దూరదృష్టిలో మోదీ చేపట్టిన ఈ పథకాలకు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి అమిత స్పంద వస్తుందన్నారు. ఈ పథకాల కోసం రూ. లక్ష కోట్లు కేటాయిస్తున్నట్టు తెలియజేశారు. రూ. 48 వేల కోట్లతో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని వెంకయ్య స్పష్టంచేశారు.