రూ.2లక్షలు దాటితే 2లక్షలు ఫైన్

న్యూఢిల్లీ: న‌గ‌దు లావాదేవీలు రూ.2 ల‌క్ష‌లు, అంత‌కు మించి దాటితే చ‌ట్ట‌ప‌ర‌మైన‌ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఐటీశాఖ వార్నింగ్ ఇచ్చింది. ఒక వ్య‌క్తి ద‌గ్గ‌ర నుంచి ఒక రోజులో రెండు ల‌క్ష‌లు లేదా అంత‌కు మించి న‌గ‌దు డ‌బ్బును తీసుకుంటే అది చ‌ట్ట వ్య‌తిరేమ‌ని ఐటీశాఖ సోమ‌వారం ఓ ప్ర‌ట‌క‌న‌లో పేర్కొన్న‌ది. ఐటీశాఖ తాజా ఆదేశాల ప్ర‌కారం ఒక వ్య‌క్తి నుంచి రోజుకు ఒక‌టి లేదా అంత‌కుమించిన లావాదీవీల్లో రూ.2లక్ష‌ల‌కు మించి నేరుగా న‌గ‌దును స్వీక‌రించ‌రాదు. స్థిరాస్థుల క్ర‌య‌విక్ర‌యాల్లో ఈ ప‌రిమితి రూ.20 వేలే. అదే వ్యాపార‌ప‌ర‌మైన వ్య‌యాలు, వృత్తి సంబంధిత అంశాల్లో అయితే రూ.10వేలే. అంత‌కు మించి న‌గ‌దు చేతులు మార‌టానికి వీల్లేద‌ని ఐటీ శాఖ స్ప‌ష్టం చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం ఈ ఏడాది ఏప్రిల్ ఒక‌ట‌వ తేదీన రెండు ల‌క్ష‌లు దాటిన‌ లావాదేవీల‌ను నిషేధిస్తూ చ‌ట్టం చేసింది. ఐటీ యాక్ట్‌లోని 269 ఎస్‌టీ చ‌ట్టం ప్రకారం ఈ చ‌ర్య‌లు తీసుకుంటారు. ఒక‌వేళ ఎవ‌రైనా చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తే నూరు శాతం ప‌న్ను వ‌సూల్ చేస్తామ‌ని ఐటీశాఖ పేర్కొన్న‌ది.