రూ.71 కోట్లతో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి):
జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.71 కోట్లతో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం ద్వారా చర్యలు చేపట్టనున్నామని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ జగన్మోహన్ తెలిపారు. ఇల్లందు డివిజన్‌లో సుమారు రెండు నుంచి మూడు కోట్ల వరకు నిధులు వెచ్చించనున్నామని తెలిపారు. సిటిడబ్ల్యుఎస్ పథకం కింద టేకులపల్లిలో 49 లక్షలతో, కామేపల్లిలో 20 లక్షలతో మంచినీటి ఎద్దడి నివారణ పనులు చేపట్టనున్నామని తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద 2.75 కోట్లతో చేపటప్టిన పనులను పరిశీలిస్తున్నామని తెలిపారు. రెండవ దశలో చేపట్టిన పనులను వారం లేదా పది రోజుల్లో పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.