రెండవ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి కృషి

రెగ్యులర్ ఏఎన్ఎంలతో సమానంగా పని చేస్తున్న రెండవ ఏఎన్ఎం లకు అలవెన్స్ లు , డ్రెస్ మెయింటెనెన్స్ కోసం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి , యూనియన్ గౌరవ అధ్యక్షులు, తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సహకారంతో కృషి చేస్తానని తెలంగాణ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాండన్ సుదర్శన్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని సాయి బృందావన్ హోటల్ లో ఏర్పాటు చేసిన రెండవ ఏఎన్ఎంల జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో రెగ్యులర్ ఏఎన్ఎంలతో సమానంగా రెండవ ఏఎన్ఎంలు పని చేస్తున్నారని అన్నారు.అంటు రోగాలను నివారించే క్రమంలో రెండవ ఏఎన్ఎంలు వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నందున వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు.హెల్త్ కార్డుల విషయాన్ని తాము ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లామని,హెల్త్ కమిషనర్ స్థాయిలో సమస్య పరిష్కారం అవుతుందన్నారు.ఏమైనా సమస్యలు ఉంటే యూనియన్ దృష్టికి తీసుకువస్తే నిరంతరం అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు భూతరాజు సైదులు,  ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుబాబు,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కుంట్ల సుకన్య ,   రెండవ ఏఎన్ఎంల జిల్లా అధ్యక్షురాలు జాని బేగం,మమత,  సరిత,  పుష్ప,  జయసుధ తదితరులు పాల్గొన్నారు.