రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని కృష్ణా నది తీరంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. గనిహత్కూర్‌ వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. మరో ట్రాక్టర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించి సిబ్బంది విఫలమయ్యారు. ట్రాక్టర్‌ యజమానులపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.

తాజావార్తలు