రెండు గ్రామాల్లో డిఎల్ పి ఓ విచారణ.
శంకరపట్నం: జనం సాక్షి సెప్టెంబర్ 30
మండల పరిధిలోని రెండుగ్రామాల్లో శుక్రవారం హుజురాబాద్ డిఎల్ పి ఓ జి లతా విచారణ చేశారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ లతా మాట్లాడారు. శంకరపట్నం మండలం లింగాపూర్, అంతం రాజిరెడ్డి, రాజాపూర్ గ్రామ ఉప సర్పంచ్ కుర్రే ఓదెలు, పాలకవర్గ సభ్యులు, గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఫిర్యాదుదారుల సమక్షంలో పాలకవర్గ సమక్షంలో క్షేత్రస్థాయి విచారణ చేసి తన విచారణ వెల్లడైన ప్రతి అంశాన్ని ఉన్నతాధికారులకు నివేదికలు తయారుచేసి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీవో కాజా బషిరోద్దిన్, సర్పంచులు అంతం వీరారెడ్డి, పిన్ రెడ్డి వసంత నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ్, పంచాయతీ కార్యదర్శులు, జ్యోతి, కిరణ్, పాలకవర్గ సభ్యులు ఫిర్యాదారులు తదితరులు ఉన్నారు.