రెండు రాష్ట్రాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు
– టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
నిజామాబాద్,జూన్18(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హావిూలను విస్మరించి పాలన చేస్తున్నారని అన్నారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ టి.కేబినెట్‌లో మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఓటుకు నోటు కేసులో ఆధారాలు ఉంటే రేవంత్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్‌ఎస్ నేతలనూ శిక్షించాలని ఉత్తమ్ అన్నారు. టిఆర్‌ఎస్,టిడిపిలు రెండూ దొంగల పార్టీలేని అన్నారు.ఓటుకు నోటు కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ పట్టుబడితే, టిఆర్‌ఎస్ కూడా అదే పని చేసిందని, కాంగ్రెస్,టిడిపి ఎమ్మెల్యేలను ఎలా ఆకర్షించిందని ఆయన ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ కేవలం కుటుంబ పార్టీ అని ఆయన అన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ పాలన తో ప్రజలలో విసుగు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉత్తం అన్నారు.టిఆర్‌ఎస్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని విస్మరించిందని కూడా ఉత్తమ్ వ్యాఖ్యానించారు.ఇంటిఓ ఉద్యోగం అని అసలు ఉద్యోగాల ప్రకటనే లేకుండా చేశారన్నారు.
టిడీపీ దొరికిన దొంగ…టీఆర్‌ఎస్ దొరకని దొంగ అని మరో నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఫిరాయింపుదారులను విద్యార్థులు, ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు రాజ్యాంగాన్ని అపహాస్యాన్ని చేస్తున్నాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హైదారబాద్‌లో అన్నారు. సుష్మా స్వరాజ్, చంద్రబాబు వ్యవహారం
అప్రజాస్వామికమన్నారు. కేసీఆర్ ఓటుకు నోటు వ్యవహారమే కాదు ప్రజాసమస్యల్ని కూడా పట్టించుకోవాలన్నారు. కేసీఆర్ రైతులను పట్టించుకోవడం లేదని, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు.