రెండు రోజుల్లో తొలగింపు: పన్నీరు సెల్వం

చెన్నై: రెండు భారీ ఓడలు ఢీకొని సముద్రంలో చమురు ఒలికిపోయిన విషయం విదితమే. గత రెండు రోజులుగా చమురు తెట్టు తొలగింపు పనులు ఆదివారం కొనసాగుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. ఒకటీ రెండు రోజుల్లో తొలగింపు పూర్తి అవుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. చమురు తెట్టు తొలగింపు కోసం 5700 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. వరి జీవనోపాధికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు