రెండు విడతలుగా సహకార సంఘాల ఎన్నికలు
ఖమ్మం, డిసెంబర్ 8 : జిల్లాలో రెండు విడతలుగా సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం సహకార అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 107 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో జనవరి 21న జరగనున్న మొదటి విడతలో 55 సంఘాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. వీటిలో కొత్తగూడెం డివిజన్‌లో 23 సంఘాలు, భద్రాచలం డివిజన్‌లో 9, సత్తుపల్లి సబ్‌డివిజన్‌లో 27 సంఘాలున్నాయి. జనవరి 25న జరిగే రెండవ విడత ఎన్నికల్లో ఖమ్మం డివిజన్‌లోని 25, మదిర డివిజన్‌లోని 27 సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో అధికారులున్నారు. ఈ నెల 10న సహకార సంఘాలకు ఎన్నికల అధికారులను నియమించనున్నారు. రెవెన్యూ, పంచాయితీరాజ్, వ్యవసాయ శాఖలకు చెందిన వారిని ఎన్నికల అధికారులుగా నియమిస్తారు.