రెండోదశ మిషన్‌కాకతీయ విజయవంతంచేద్దాం
గోదావరిపై మరోమూడు బ్యారేజులు
మంత్రి హరీశ్
హైదరాబాద్, జనవరి 18 (జనంసాక్షి):
గోదావరి నదిపై మరో మూడు బ్యారేజీలు నిర్మిస్తామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో రెండవ దశ మిషన్ కాకతీయ పనులపై నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సవిూక్ష నిర్వహించారు. చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులకు రిటైర్డు నిపుణుల సలహాలను తీసుకుని మిషన్ కాకతీయను విజయవంతం చేస్తామని చెప్పారు. ఈ సవిూక్షకు సాగునీటి నిపుణులు టి.హనుమంతురావుతో పాటు పలువురు అధికారులు పాల్గొ న్నారు.తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు 60 ఏండ్లుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని, స్వరాష్ట్రంలో వాటా ప్రకారం నదీ జలాలను పూర్తిగా ఉపయోగించుకొనే లక్ష్యంతోనే ప్రాజెక్టుల రీడిజైన్ పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఇకపోతే మిషన్ కాకతీయతో పూర్తిస్థాయిలో చెరువనలు పునరుద్దరిస్తామని అన్నారు. ఇందుకు త్వరలోనే కార్యక్రమాలను ప్రకటిస్తామని అన్నారు. చెరువులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకుని వస్తే చిన్ననీటి పారుదల రంగం మంచి ఫలితాలను సాధించగలదన్‌ఆనరు. ఇదిలావుంటే ప్రజలకు వివరించేలా ప్రాజెక్టులను రీడిజైన్ విూద పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆదేశించారు. వివిధ ప్రాజెక్టులపై సవిూక్ష సందర్భంగా ప్రాణహిత నదిపై తుమ్మిడి హట్టి ప్రాజెక్టును రద్దుచేసే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని అన్నారు. త్వరలోనే కాళేశ్వరంలో మొక్కులు తీర్చుకుని ఆ ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభిస్తానని కేసీఆర్ చెప్పారు. గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నిర్మించే బ్యారేజిలకు సంబంధించి వ్యాప్కోస్ సమర్పించిన తుదినివేదిక (డీపీఆర్)ను ఆమోదించారు. టెండర్ల పక్రియకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే రాజీవ్‌సాగర్-ఇందిరాసాగర్ సవిూకృత ప్రాజెక్టు రీడిజైన్‌ను కూడా సీఎం ఖరారు చేశారు. వెంటనే టెండర్లు పిలిచి, పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతున్నామని, ప్రతి ఏటా రూ.25 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించనున్నామని సీఎం చెప్పారు. కొత్త, పాత ప్రాజెక్టుల పనులన్నీ ఏకకాలంలో ముందుకుసాగాలని, ఈ పక్రియలో నీటిపారుదల అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి పథకం సర్వేలు, డిజైన్లు, భూ సేకరణ, టెండర్లకు సంబంధించిన పనులు వేగంగా జరిపిన అధికారులను అభినందించారు. పాలమూరు ప్రాజెక్టుకు18 ప్యాకేజీలుగా పనులను విభజించారు. సర్కిల్-1 కార్యాలయం కింద నార్లాపూర్ నుంచి కరివెన రిజర్వాయర్ వరకు 15 ప్యాకేజీలకు, సర్కిల్-2 కింద ఉద్దండాపూర్ రిజర్వాయర్, ఇతరత్రా పనులకు టెండర్లు పిలిచారు.