రెండోరోజు ప్రారంభమైన ప్లీనరీ

పాలనా వికేంద్రీకరణ, పారదర్శికతపై స్పీకర్‌ తమ్మినేని ప్రసంగం
జగన్‌ను ఆ దుష్టచతుష్టయం ఏవిూచేయలేరన్న పేర్నినాని

గుంటూరు,జూలై9(జనం సాక్షి): వైసీపీ ప్లీనరీ సమావేశాలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ, పారదర్శికతపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటిందని తెలిపారు. శత్రువులపై వ్యూహత్మకమైన దాడులు నిర్వహించాలి… ప్రజల్లో మన శత్రువులు ఇష్టం వచ్చినట్టు మాటాడుతున్నారు. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. మనం కదనరంగంలోకి దిగి కార్యోన్ముఖులం కావాలని అంటూ పిలుపునిచ్చారు. స్పీకర్‌ ప్లీనరీకి వచ్చారని… రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ ఓ పేపర్లో రాశారని… గతంలో స్పీకర్‌ కొడెల రాలేదా అది కనపడలేదా అని ప్రశ్నించారు. నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడిని, ఆ తరువాతే ఎమ్మెల్యే, శాసనసభాపతిని అని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఇకపోతే అబద్దాలు చెప్పడంలో
చంద్రబాబును మించిన వారు లేరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో విూడియా`దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. దుష్టచతుష్టయంలో మొదటి దొంగ చంద్రబాబు అని, తరవాత ఎల్లో విూడియా ప్రతినిధులని ఆరోపించారు. దుష్టచతుష్టయం కలిసి విూడియా వ్యవస్థను దారుణంగా తయారుచేశారని అన్నారు. ఈ నలుగురిది కూడా మనోడు మాత్రమే అధికారంలో ఉండాలని ఉన్మాద ప్రయత్నం. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఇప్పుడు కూడా రోజూ విషపు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. ఈనాడు నమ్మక ద్రోహి అని ఎన్‌టీఆర్‌ ఆనాడే అన్నారు. ఔటర్‌ రింగ్‌ కట్టానని చంద్రబాబు చెబుతారు. మరి భూసేకరణ వైఎస్సార్‌ ఎందుకు చేశారు?. డబ్బు కోసం వీరంతా దుర్మార్గాలు లేవు. ఏపీలో కందిపప్పు రేటు ఎంత? తెలంగాణలో ఎంత? నీ హెరిటేజ్‌లోఎంత ఉంది?. ఆయిల్‌ ధరలు మిగతా రాష్టాల్ల్రో ఎలా ఉన్నాయని అన్నారు. సీఎం జగన్‌ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. నాలాంటోళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం జగన్‌కోసం పనిచేయాలి. ఇంటింటికి తిరగండి.. పథకాలు అందినవా.. లేదా ఆరా తీయాలన్నారు. పథకాలు రాకపోతే భాధ్యత వహించి సరిదిద్దాలన్నారు. అర్హత ఉంటే ఏ పార్టీ అయినా సంక్షేమ పథకాలు అందాలని సీఎం చెప్పారు. ఎవరూ శాశ్వతం కాదు..జెండా మోసే కార్యకర్తలు శాశ్వతం అని పేర్ని నాని అన్నారు. సింగిల్‌గా రాలేమని చంద్రబాబు, పవన్‌కు తెలుసు.. అందుకే అందరూ కట్ట కట్టుకుని రావాలని చూస్తున్నారు. సోనియా గాంధీనే గడగడలాడిరచిన వ్యక్తి సీఎం జగన్‌. చంద్రబాబుతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా, 16 మాసాలు జైల్లో పెట్టినా అడుగు వెనక్కు తగ్గలేదు. జగన్‌ అంటే తగ్గేదేలే. అలాంటి వ్యక్తి ఈ దుష్టచతుష్టయానికి భయపడతాడా? అంటూ పేర్ని నాని సభికుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
““““““