రెండో దశ పోలింగ్.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో

jgsud6j1పట్నా: బిహార్‌ ఎన్నికలు శుక్రవారంతో రెండోదశలోకి ప్రవేశించాయి. 32 నియోజకవర్గాల్లో పోటీపడుతున్న 456 మంది అభ్యర్థుల భవిష్యత్తును ఓటర్లు నిర్ణయించనున్నారు. ఈ నియోజకవర్గాలన్నీ కూడా నక్సలైట్ల ప్రభావం కిందఉన్న ఆరుజిల్లాల పరిధిలోనివి కాబట్టి.. ఎన్నికల నిర్వహణ భద్రతాదళాలకు గట్టిసవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం 993 కంపెనీల కేంద్రపారామిలిటరీ దళాలను, రాష్ట్రపోలీసులను మోహరించారు. భద్రతపరమైన సమస్యలున్నందున పోలింగ్‌ వేళలను ఎన్నికలసంఘం సవరించింది. అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఉదయం ఏడు గంటలకే మొదలవుతుందని.. 11 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడింటికి ముగుస్తుందని, మరో 12 స్థానాల్లో సాయంత్రం నాలుగింటికి ముగుస్తుందని, మిగిలిన తొమ్మిందిటిలో మాత్రమే సాయంత్రం ఐదు వరకూ కొనసాగుతుందని అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ఆర్‌.లక్ష్మణన్‌ తెలిపారు. రెండోదశ ఎన్నికల్లో పోటీ పడుతున్న 456 మంది అభ్యర్థుల్లో 32 మంది మహిళలున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 86,13,870 మంది. అధికారులు 9,119 పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేశారు.

బరిలో ప్రముఖులు: ఇమామ్‌గంజ్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఆవాంమంచ్‌ అధినేత జితన్‌రాంమాంఝీ పోటీపడుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్‌ ఉదయ్‌నారాయణ్‌ ాదరి (జేడీయూ) ఆయన మ్యుాప్రత్యర్థి. ఈ నియోజకవర్గం నుంచి ఉదయ్‌నారాయణ్‌ ఇప్పటివరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మఖ్దుంపూర్‌ అనే మరో స్థానం నుంచి కూడా మాంఝీ బరిలో ఉన్నారు. భాజపా సీనియర్‌నేత ప్రేమ్‌కుమార్‌ (గయపట్టణం), భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్‌నారాయణ్‌సింగ్‌ (నబీనగర్‌), మంత్రి జయ్‌కుమార్‌సింగ్‌ (దినారా) కూడా ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటున్నారు.