రెండో రోజు రేవంత్‌పై ప్రశ్నల వర్షం
హైదరాబాద్, జూన్ 07(జనంసాక్షి):
ఓటుకు నోటు కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డిపై రెండో రోజు విచారణ ముగిసింది. విచారణలో భాగంగా రేవంత్‌ను 50-60 ప్రశ్నలు అడిగినట్లు రేవంత్ తరఫున లాయర్ సుధీర్ కుమార్ వెల్లడించారు. వాటన్నింటికీ రేవంత్ ఓపిగ్గా సమాధానం చెప్పారని తెలిపారు. సిట్ కార్యాలయంలో రేవంత్‌కు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, రేవంత్ ప్రస్తుతం గొంతునొప్పితో బాధపడుతున్నారని లాయర్ తెలిపారు. విచారణ అనంతరం ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు.