రెండో రోజు వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్…

పలు విశిష్ట అంశాలపై శిక్షణ తరగతులు….
వెంకటాపూర్(రామప్ప)సెప్టెంబర్20(జనం సాక్షి):-
రామప్పలో రెండో రోజు వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంపెయిన్
వాలెంటైర్స్ మొదటగా యోగ గురువు ఆధ్వర్యంలో రామప్ప గార్డెన్లో రెండు పార్టీ యోగాసనాలు నేర్చుకున్నారు.  రాష్ట్ర పురావస్తు శాఖ రిటైర్డ్ డైరెక్టర్ రంగాచార్యుల,ట్రైబల్స్ మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ,కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావులు వాలెంటెన్స్ కి ఆయా సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చారు.అనంతరం రామప్ప దేవాలయ నిర్మాణం, విశిష్టత, చరిత్ర, సండ్ బాక్స్ టెక్నాలజీ, తేలే ఇటుకలు, తదితర అంశాలపై ప్రోపేసర్ పాండు రంగారావు,టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ లు వివరించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యులు శ్రీధర్, రాష్ట్ర పురావస్తు శాఖ ఎడి మల్లునాయక్ తదితరులు పాల్గొన్నారు.