రెండో వికెట్‌ కోల్పోయిన అఫ్గానిస్థాన్‌

పెర్త్‌ : ప్రపంచకప్‌లో భాగంగా ఆస్గేలియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో 32 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ జావేద్‌ అహ్మదీ(13) హజీల్‌వుడ్‌ బౌలింగ్‌లో క్లార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్థాన్‌ రెండు వికెట్లు కోల్పోయి 33 పరుగులతో ఆడుతోంది.