రెవెన్యూ అధికారుల దాష్టీకం
– ఇంట్లో మనిషి నిద్రిస్తుండగానే కూల్చివేత
హైదరాబాద్,అక్టోబర్24(జనంసాక్షి):
జవహర్‌నగర్ దేవేంద్రనగర్‌లో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేసారు. అయితో ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ఇంట్లో ఉండగానే అధికారులు ఇళ్లును కూల్చివేశారు. దీంతో మట్టిపెళ్లలు పడి అతడికి తీవ్రగాయాలు కాగా క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై స్థానికులు మండిపడ్డారు. ఇంట్లో ఎవరు ఉన్నారో లేదో చూసుకోకుండా ఎలా కూలగొడతారని అన్నారు. ఆ వ్యక్తి ఇంట్లో ఉండగానే ఆ ఇంటిని అధికారులు కూల్చివేశారని స్థానికులు అన్నారు. సిమెంట్ రేకుల ఇల్లు కావడంతో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సిమెంట్ రేకులు అతనిపై పడే సరికి కాపాడంటూ బాధితుడు మొత్తుకున్నాడు. ఆ వ్యక్తి ఇంట్లో ఉండగానే ఆ ఇల్లును జేసీబీతో అధికారులు కూల్చివేశారు. గోడ కూలి తీవ్ర గాయాలతో శిథిలాల మధ్య చిక్కుకున్న వ్యక్తిని స్థానికులు రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న స్థానికులు, అధికారులు తేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణమైన రెవెన్యూ అధికారులపై చర్య తీసుకోవాలని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.