రెవెన్యూ డివిజన్ కోసం దండోరా మోగిస్తాం

చేర్యాల పట్టణ మాదిగ కులస్తులు

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 06 : చేర్యాల్ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఊరూరా దండోరా మోగిస్తామని మాదిగ కులస్తులు స్పష్టం చేశారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై పాత బస్టాండ్ వద్ద చేస్తున్న దీక్షలు శుక్రవారం 26వ రోజుకు చేరాయి. చేర్యాల మాదిగ కుల సంఘం నాయకులు దీక్షల్లో కూర్చున్నారు. వారికి జేఏసీ చైర్మన్ రామగళ్ల పరమేశ్వర్, కో చైర్మన్ పుర్మ ఆగంరెడ్డి చేతుల మీదుగా కండువాలు వేసి ప్రారంభించారు. జేఏసీ ఉద్యమానికి 2016 రూపాయలు అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేర్యాల ప్రాంత అస్తిత్వం కోసం జరిగే ఉద్యమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మీనమేశాలు లెక్కపెట్టకుండా తక్షణమే చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఊరురా మాదిగ డప్పులతో దండోరా మోగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిగారి యాదగిరి, ముస్త్యాల రాజేశ్వర్, కర్రోల్ల భాస్కర్, భూమిగారి రాజేందర్, భూమిగారి ప్రభాకర్, దామోదర్, రమేష్, మల్లేశం, మధుకర్, విజయ్, విష్ణు, బాబు,మహేందర్, రామగల్ల జూకయ్య, మహేందర్, భూమయ్య, నర్సింలు, శ్రీనివాస్, మహేందర్, శ్రీదర్, యాదగిరి, శ్రీనివాస్, బస్వగళ్ళ సిద్దయ్య, నవీన్ , ఎర్ర మైసగళ్ళ బుచ్చిబాబు, శ్రీకాంత్, కరుణాకర్, సనువాల ప్రసాద్, ఎల్లయ్య, పాకాల అనిల్, సుంచు యాదయ్య, ఎర్రోళ్ల రమేష్ , పాముల అర్జున్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.