రెవెన్యూ డివిజన్ గా ఇల్లందును కొమరారం బోడులను మండల కేంద్రాలుగా ప్రకటించాలి…

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ  డిమాండ్…
ఇల్లందు ఆగస్టు 27 (జనం సాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందును రెవెన్యూ డివిజన్గా కొమరారం బోడులను మండల కేంద్రాలుగా ప్రకటించాలని, ఆగస్టు 30 నాడు ఇల్లందు పట్టణం, కొమరారం బోడు ప్రాంతాల బందును జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ   ఇల్లందు డివిజన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇల్లందు న్యూ డెమోక్రసీ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని ప్రకటించింది. పది జిల్లాలను 31 జిల్లాలుగా చేసి పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో నూతనంగా 13 మండలాలను ప్రకటించిందికాని, అన్ని అర్హతలు అవకాశాలు ఉన్న కోమరారం , బోడులను మండలాలుగా ప్రకటించకపోవడం ఆంతర్యం ఏమిటి…? బంగారు తెలంగాణ అంటే ప్రజలకు పరిపాలనను దూరంగా ఉంచడమేనా అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, పట్టణ కార్యదర్శి సారంగపాణి, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు తోడేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు