రెవెన్యూ సదస్సు ప్రారంభం
ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం పట్టణంలో ఆఖరి, మూడో రెవెన్యూ సదస్సును బురహాన్‌పురం ఎన్‌ఎన్‌టీ పాఠశాలలో అర్బన్ తహశీల్దారు అశోకచక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ పట్టణ పరిధిలోని భూ వివాదాలకు సంబంధించిన సమస్యలను తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు మాజీకౌన్సిలర్లు, ఆర్‌ఐ నవీన్ వీఆర్వోలు పాల్గొన్నారు.