రేఖానాయక్‌కు అభినందనలు
ఆదిలాబాద్,డిసెంబర్17(జనంసాక్షి): నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. అవినీతి రహిత స్వచ్ఛమైన పాలన ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖను టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసిసన్మానించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ యూత్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.