రేణిగుంట-మైసూరుల మధ్య 40 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రేణిగుంటనుంచి మైసూరుకు 40 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మథ్య రైల్వే ప్రకటించింది. ప్రతి శనివారం మథ్యాహ్నం 12.45 గంటలకు రేణిగుంట నుంచి ఒక ప్రత్యేక రైలు మైసూరు బయలుదేరుతుంది. ప్రతి శుక్రవారం రాత్రి 10.45 గంటలకు మైసూరు నుంచి ఒక ప్రత్యేక రైలు రేణిగుంట బయలుదేరుతుంది. రేణిగుంట నుంచి పాకాల, చిత్తూరు, బెంగుళూరు మీదుగా ఈ ప్రత్యేకరైలు మైసూరు వెళ్తుంది.