రేపటి నుంచి తెదేపా మండల పార్టీ సమావేశాలు
ఖమ్మం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 7వరకు మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. పల్లెపల్లెకు తెదేపా కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఏప్రిల్ వరకు పూర్తి చేయాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను, జిల్లా నాయకులను కోరారు. స్థానిక సమస్యలు, అధిక ధరలు, విద్యుత్తు ఛార్జీల పెంపుదల తదితర కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నియోజకవర్గం, మండల స్థాయిలో ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుని దశల వారీగా ఆందోళనలు చేపట్టాలని సూచించారు.