రేపు ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఛత్తీస్‌గఢ్ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా స్వామి వివేకానంద ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజోత్సవ్ వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.