రేపు జరగబోవు ఎన్నికలకు భారీ బందోబస్తు

ములుగు ప్రతినిధి,నవంబర్29(జనం సాక్షి):-
రేపు జరగబోవు తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు సజావుగా సాగేలా పోలీస్ శాఖ తరఫున  జిల్లా ఎస్పీ  తగు అన్ని చర్యలను చేపట్టారు.ములుగు జిల్లాకు ఇప్పటికే సెంట్రల్ అర్మడ్ పోలీస్ ఫోర్స్ బలగాలు 19కంపెనీలలో 1300మంది  వీచ్చేసారు. జిల్లా పోలీసు విభాగంలో  650 మంది చతిస్గడ్ రాష్ట్రం నుండి హోంగార్డ్స్ ను 300 మందిని ఇతర డిపార్ట్మెంట్స్ నుండి 78మందిని ఎలక్షన్ విధులకు కేటాయించారు.ఈ సందర్బంగా  జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ  ములుగు జిల్లాలో 307పోలింగ్ కేంద్రాలు 202పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయని వీటిలో సాధారణ,సమస్యత్మక మరియు మావోయిస్టులచే హాని ఉన్న పోలింగ్ కేంద్రాలు గా విభజించామని దానికి అనుగుణంగా భద్రత చర్యలు చేపట్టామని  తెలియచేసారు.ములుగు జిల్లా లో వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున ఎన్నికలలో ఎటువంటి ఆటంకం కలగకుండా  ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామని   మావోయిస్టు హాని ఉన్న పోలింగ్ కేంద్రాల చుట్టూ మూడంచల భద్రత వ్యవస్థ  పొందుపరిచామని దీనిలో భాగంగా గ్రేహౌండ్స్ పార్టీ,జిల్లా స్పెషల్ పార్టీ,  సెంట్రల్ అర్మడ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లచే గస్తీ నిర్వహిస్తున్నామని  తెలియచేసారు.మారుమూల గ్రామాలలో అటవీ ప్రాంతాలలో ఈవీఎంల తరలింపులో భాగంగా ఎటువంటి ఆటంకం రాకుండా  రోడ్డు ఓపెనింగ్ పార్టీలచే విస్తృత తనిఖీలు చేపట్టామని వాటితో పాటు ఆకస్మిక వాహనాల తనిఖీ, బైక్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని  ఇందులో భాగంగా స్ట్రైకింగ్ ఫోర్స్ను 10టీములుగా విభజించామని  వీటిలో భాగంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్  టీం తో పాటు  అనుకోని సంఘటన సంభవిస్తే  దాన్ని ప్రతిఘటించేలా క్విక్ రియాక్షన్ టీం ను  ఏర్పాటు చేశామని ఇప్పటికే ప్రతి ఒక్క టీం తమ తమ స్థానాలలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఎస్పీ  తెలియజేశారు