రేపు నిర్మల్ రానున్న హైకోర్టు జడ్జి
గాంధీపార్కు నిర్మల్: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి చంద్రకుమార్ శుక్రవారం సాయంత్రం నిర్మల్ రానున్నారు. రెండురోజుల పాటు పట్టణంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 22 న సాయంత్రం హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు వచ్చి ఇక్కడే బసచేస్తారు. 23న ఉదయం అల్పాహరం ముగించుకొని 10 గంటల నుంచి 12 గంటల వరకు స్థానిక ప్రభుత్వ డిగ్రి కళాశాలలో నిర్వహించనున్న కార్యక్రమానికి హజరువుతారు. 24 ఉదయం 9.30 గంటలకు దిలావర్పూర్ మండలంలోని నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు బాసర సరస్వతి అమ్మవారిని ధర్శించెకునేందుకు వెళతారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ట్రిపెల్ఐటీ కళాశీలను సందర్శించి 4 గంటలకు తిరిగి బాసర చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్ తిరిగివెళతారు.