రేపు పాఠశాలలకు బంద్‌ పిలుపు

హైదరాబాద్‌: విద్యార్థి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం కావడాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల రేపు బంద్‌కు పిలుపిచ్చాయి. పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం, మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం వస్తువుల వాడకం, ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణలో ప్రభుత్వ చేతకాని తనం వంటి లు సమస్యలపై బంద్‌ చేస్తున్నట్లు ఎన్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్‌ తెలిపారు. గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం మాత్రం విద్యార్థి సంఘాల బంద్‌ పిలుపును వ్యతిరేకిస్తోంది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు కాకముందే ఇప్పటికే మూడు రోజులు సెలవులుగా విద్యార్థి సంఘాలు ప్రకటించాయని బంద్‌ల పేరుతో పిల్లల భవిష్యత్తును పాడు చేయవద్దని కోరుతున్నాయి. గుర్తింపు పొందిన పాఠశాలలేవి బంద్‌ పాటించవద్దని పిలుపునిచ్చాయి.