రేప్ వ్యాఖ్యలపై గవర్నర్ కు ఫిర్యాదు
తక్షనమేచర్యలు తీసుకోవాలన్న ఎన్జీవో
ఢల్లీి,డిసెంబర్17(జనంసాక్షి): కర్నాటక ఎమ్మెల్యే రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేప్ ను ఎంజాయ్ చేయాలంటూ ఆయన చేసిన కామెంట్లపై పలువురు మండిపడు తున్నారు. తాజాగా ఢల్లీికి చెందిన ఓ ఎన్జీఓ రమేష్ కుమార్ పై కర్నాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోత్ కు ఫిర్యాదు చేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని అందులో పేర్కొంది. రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, మహిళలు గౌరవప్రదంగా జీవించే హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయని ఎన్జీఓ అభిప్రాయపడిరది. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల ఆయనకున్న అభిప్రాయానికి నిదర్శనమని విమర్శించింది. ప్రజా ప్రతినిధులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇతరుల నుంచి ఏం ఆశించవచ్చని ప్రశ్నించింది. మహిళల్ని దేవతలుగా పూజించే దేశంలో ఇలాంటి మాటలు వినాల్సి రావడం సిగ్గు చేటని అభిప్రాయపడిరది.