రేవంత్‌కు ఒకరోజు బెయిలు
హైదరాబాద్,జూన్10(జనంసాక్షి):
రేవంత్‌కు బెయిల్ దొరికింది. పన్నెండు గంటలపాటు షరతులతో కూడిన బెయిల్‌పై చర్లపల్లి జైలులో ఉన్న టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం పన్నెండు గంటలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇది కూడా కండిషన్ బెయిల్ ఇచ్చారు. రేవంత్ కుమార్తె వివాహ నిశ్చితార్థం గురువారం ఉన్న దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు న్యాయస్థానం రేవంత్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సమయంలో విూడియాతోనూ, రాజకీయ నేతలతోనూ కలవకూడదని షరతు విధించింది. నాలుగు రోజులు ఎసిబి కస్టడీలో ఉన్న రేవంత్‌ను మంగళవారం సాయంత్రం తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. బుధవారం రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. రేవంత్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి అయ్యాయి. తొలుత కోర్టు తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేసింది. నాలుగు రోజుల ఏసీబీ కస్టడీలో రేవంత్ నుంచి ఏసీబీ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. రేవంత్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందన్నారు. తర్వాత తన కూతురు నిశ్చితార్థం ఉందని చెప్పడంతో కన్విన్స్ అయిన కోర్టు బెయిల్‌కు అంగీకరించింది. ఎసిబి లార్ కూడా దీనికి ఓకే చెప్పారు.
ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన 12 గంటల బెయిల్ మంజూరైంది. ఏసీబీ కోర్టు బుధవారం ఆయనకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది. కుమార్తె నిశ్చితార్థం కోసం బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి బెయిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిశ్చితార్థం కోసమే అయితే బెయిల్ ఇచ్చేందుకు తమకు కూడా అభ్యంతరం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ముందురోజు సాయంత్రం వెళ్లి, తర్వాతి రోజు సాయంత్రం వస్తే పర్వాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి తరఫున సుప్రీంకోర్టు నుంచి వచ్చిన న్యాయవాదులు తమ వాదన వినిపించారు. వాదనలన్నీ విన్న తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ సమయంలో ఆయన రాజకీయ నాయకులు, సినిమా, విూడియా ఇలా ప్రముఖులతో మాట్లాడవద్దని సూచించింది. గురువారం ఉదయం ఆయనను 6 గంటలకు విడుదల చేసి తిరిగి సాయంత్రం 6 గంటలకు తసీఉకుని వస్తారు.