రేవంత్‌కు మొదటిరోజు ప్రశ్నల వర్షం
మరో మూడు రోజులు ఏసీబీ కస్టజీలోనే
హైదరాబాద్,జూన్6(Ûజనంసాక్షి): ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆనాలుగు రోజులపాటు అనుమతిస్తూ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో రేవంత్‌ను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు తొలి రోజు రేవంత్‌రెడ్డిని రెండు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం ఏసీబీ ఆఫీస్ నుంచి సిట్ కార్యాలయానికి రేవంత్‌ను తరలించారు. మరో మూడు రోజుల పాటు రేవంత్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. రూ. 5 కోట్ల డీల్‌పై రేవంత్‌ను ఏసీబీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే కోణంలో రేవంత్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహాలను శనివారం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారని రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదులు తెలిపారు. రేవంత్‌ను రెండు గంటల పాటు, సెబాస్టియన్, ఉదయ్‌సింహాలను నాలుగు గంటల పాటు ప్రశ్నించినట్లు చెప్పారు. అడిగిన ప్రశ్నలు, చెప్పిన జవాబులు నివేదికను ఏసీబీ అధికారులు కోర్టులోనే సమర్పిస్తారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆయన్ని తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకు కస్టడీకి తీసుకుంటారని చెప్పారు.