రేవంత్‌కు రిమాండ్ పొడగింపు
– ఈ నెల 29 వరకు కటకటాలు
హైదరాబాద్,జూన్15(జనంసాక్షి):
ఓటుకు నోటు కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహాలకు ఏసీబీ న్యాయస్థానం ఈనెల 29 వరకు రిమాండ్ పొడిగించింది. కోర్టు గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ పూర్తి కావడంతో పోలీసులు సోమవారం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని మెమోలో పేర్కొన్నారు. అనంతరం నిందితులు ముగ్గురికి ఈనెల 29 తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. ఇదంతా నాలుగైదు నిముషాల్లో పూర్తయ్యిందని తెలుస్తోంది. వీరి రిమాండ్ సోమవారతో ముగియడంతో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తదితరులను ఏసీబీ అధికారులు చర్లపల్లి జైలు నుంచి ఏసీబీ న్యాయస్థానానికి తరలించారు. న్యాయస్థానం విధించిన రిమాండ్ ముగియడంతో పోలీసులు ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. గతంలో కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచారు. చర్లపల్లి జైలు నుంచి భారీ భద్రత నడుమ నిందితులను న్యాయస్థానానికి తరలించారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇతరులకు విధించిన జ్యుడీయల్ కస్టడీని ఏసీబీ కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. ఈనెల 29 వరకు కస్టడీని పెంచింది. రేవంత్ రెడ్డితో పాటు ఉదయసింహా, సెబాస్టియన్ కస్టడీని కూడా న్యాయస్థానం పొడిగించింది. ఆడియో టేపులపై ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అందాల్సి ఉందని, దర్యాప్తు పెండింగ్ ఉందని కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారుల వాదనతో ఏకీభవించిన కోర్టు నిందితుల కస్టడీని పెంచింది.ఈ కేసు సంబంధించి ఏసీబీ అధికారులు కోర్టుకు మెమో సమర్పించినట్టు సమాచారం. మరోవైపు బెయిల్ కోసం రేవంత్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆయనను మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు. ఇదిలావుంటే రేవంత్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేవారు. అయన తరపున లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. ఎసిబి కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిసన్ తిరస్కరించడంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, తానుఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు.