రేవంత్‌కు సెక్యూరిటీ ఏర్పాటు

హైకోర్టు ఆదేశాలతో పోలీస్‌ శాఖ నిర్ణయం
హైదరాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డికి తెలంగాణ పోలీస్‌ శాఖ సెక్యూరిటీ పెంచింది. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని రేవంత్‌ ఆరోపించారు. తనకు భద్రత పెంచాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు భద్రత పెంచాలని కోర్టు పోలీస్‌ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేవంత్‌కు 4ప్లస్‌ 4 గన్‌మెన్‌ను పోలీస్‌ శాఖ కేటాయించింది. రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌కు 2 ఎస్కార్ట్‌ వాహనాలు, గన్‌మన్లను పంపించింది. ఎన్నికల ఫలితాల రోజు వరకే సెక్యూరిటీ కేటాయించింది. ఆయన కోరుకున్న మేరకు సెక్యూరిటీ వచ్చింది.