రేవంత్‌పై ఇజ్జత్‌దావా..
` ఇష్టంవచ్చినట్లు మాట్లాడతావా..!
` మండిపడ్డ కేటీఆర్
` తన ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై చర్యలకు వినతి
హైదరాబాద్,సెప్టెంబరు 20(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. పిసిసి చీఫ్ రేవంత్ ఆరోపనలతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విటర్‌తో పాటు తెలంగాణను హీటెక్కించారు. రేవంత్‌పై కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. సిటీ సివిల్‌కోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా.. తన పేరును వాడుతున్నారని కేటీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న.. వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును మంత్రి కోరారు. రేవంత్‌రెడ్డిని తగిన విధంగా కోర్టు శిక్షిస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే కొంత మంది ఉద్దేశ్యపూ ర్వకంగా తనపై దుష్పచ్రారం చేస్తున్నారు అని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నానని పేర్కొన్నారు. న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేశానని తెలిపారు. దుష్పచ్రారం చేస్తున్న వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తు న్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విషయం విదితమే. తాను ఎలాంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నాను. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టుకు సిద్ధమైతే.. తానే ఢల్లీి ఎయిమ్స్‌కు వెళ్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి తనది కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్‌చీట్‌తో వస్తే రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పి, పదవులు వదులు కుంటారా? అని కేటీఆర్ సూటిగా అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టులకు రేవంత్ సిద్ధమా? అని కేటీఆర్ అడిగారు.అసలేం జరిగిందంటే..రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తాను ‘వైట్ ఛాలెంజ్’ ప్రారంభిస్తున్నానని ఇటీవల రేవంత్ ప్రకటించారు. దీనికోసం తాను కూడా సిద్ధమని.. డ్రగ్స్ పరీక్షల కోసం తన రక్తం, వెంట్రుకల నమూనాలను ఇస్తానని చెప్పారు. అక్కడితో ఆగకుండా మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నానని తెలిపారు. వాళ్లిద్దరూ ఛాలెంజ్‌ను స్వీకరించి మరో ఇద్దరికి ఛాలెంజ్ చేయాలని రేవంత్ కోరారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కు వద్దకు చేరుకుంటానని.. ఏ ఆస్పత్రికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని చెప్పారు. డ్రగ్స్ కేసుపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని.. ఓ మంత్రిగా ఎందుకు జోక్యం చేసుకోకూడదని రేవంత్ ప్రశ్నించారు.డ్రగ్స్ పరీక్షలపై రేవంత్‌రెడ్డి విసిరిన ‘వైట్ ఛాలెంజ్’పై కేటీఆర్ స్పందించారు. తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ ఒప్పుకొంటే దిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధం. నాది చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారి స్థాయి కాదు. పరీక్షల్లో క్లీన్‌చిట్ వస్తే రేవంత్ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?’’ అని రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు. పరీక్షలకు రాహుల్ గాంధీ సిద్ధమా? ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్‌పై రేవంత్ స్పందించారు. ఆయన కూడా ట్విటర్ ద్వారానే కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తో కలిసి లైడిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని.. దీనికి సమయం, స్థలం చెప్పాలన్నారు. ‘‘కేసీఆర్ అవినీతి ఆరోపణలపై లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం. సీబీఐ కేసులు, సహారా పీఎఫ్ అక్రమాలు, ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్మాణంలో అక్రమాలపై లైడిటెక్టర్ పరీక్షలకు కేసీఆర్ సిద్ధమా?’’ అని రేవంత్ సవాల్ విసిరారు. మరోవైపు రేవంత్ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ మళ్లీ స్పందించారు తనపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని.. కోర్టులో పరువునష్టం దావా వేసినట్లు తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. వారిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.