రేవంత్ కేసు విచారణ 20కి వాయిదా
హైదరాబాద్,డిసెంబర్17(జనంసాక్షి): కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై విచారణను హైకోర్టు 20కి వాయిదా వేసింది. సోమవారం ఉదయం ఈ కేసు విచారణకు రాగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. వచ్చే గురువారం తమ వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. ఎన్నికలకు ముందు కెసిఆర్ బహిరం సభ కారణంగా రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ పిలుపుతో పాటు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌ను అరెస్ట్ చేశారు. దీనిపై అప్పట్లో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సాయంత్రానికి విడుదల చేశారు.