రేవంత్ నీ ప్రచారం వద్దు
– అడ్డుకున్న భాజపా కార్యకర్తలు
హైదరాబాద్,జనవరి25(జనంసాక్షి):తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మిత్రపక్షమైన బిజెపి కార్యకర్తల షాక్ తిన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ ప్రచారానికి వస్తే బీజేపీకి పడే ఓట్లు కూడా పడవని వారు అంటున్నారు. ఈ ఘటన హైదరాబాదులోని అవిూర్‌పేటలో చోటు చేసుకుంది. తాము పోటీ చేస్తున్న డివిజన్లలో ప్రచారానికి రావొద్దని బీజేపీ శ్రేణులు రేవంత్ రెడ్డికి స్పష్టం చేశాయి. బీజేపీ శ్రేణులు ససేమిరా అనడంతో రేవంత్ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపి, టిడిపి కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దోపిడీదారులకు, సేవాపరుల మధ్య జరుగతున్న ఎన్నికలని రేవంత్‌రెడ్డి అన్నారు. కూన వెంకటేష్‌గౌడ్ తన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడితే మంత్రి తలసాని శ్రీనివాస్ దొంగలా వచ్చి సీటు ఎగరేసుకపోయారని ఆయన ధ్వజమెత్తారు. ఃఏఖ జీఞబితిలతిబబిబ తీవతీవఞబిబ ఖీవలజీనిబిష్ట్ర ఖీవటటవ’బ ఞనీఎజూజీతిణని బన్సీలాల్‌పేటలో రేవంత్‌రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేత లోకేష్‌ను విమర్శించే స్థాయి తలసానికి లేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. రూ. 12 లక్షల పట్టివేత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సోమవారంనాడు చైతన్యపురి వద్ద తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.12 లక్షలు కనిపించాయి. కరెన్నీకి సరియైన దృవపత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.