రేవంత్ మరో కేసు !
ఇసి చేతికి ఫోరెన్సిక్ నివేదిక
హైదారబాద్,జులై3(జనంసాక్షి): ఓటుకు నోలు కేసులో కీలక పరిణాలమాలు చోటు చేసు కున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతి కి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక కాపీ అం దింది. ప్రిన్సిపల్ కోర్టు ఆదేశాలతో ఎలక్షన్ కమి షన్ డాక్యుమెంట్లు పొందింది. ఈ కేసుకు సంబంధించిన కాల్ డేటాను కూడా ఎలక్షన్ కమిషన్ పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నివేదిక పొందడానికి ఈసీ కోర్టును కోరనుంది. ఈ మొత్తం వ్యవహారం సోమవారంలోగా పూర్తి చేయాలని ఈసీ ప్రయ త్నిస్తుంది. ఈ కేసులో నిందితులు దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదం విధించే అవకాశం ఉంది.