రేవంత్ ముడుపులపై సీబీఐ విచారణ జరపండి
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కోరిన వీహెచ్
న్యూఢిల్లీ,జూన్6(జనంసాక్షి): ఓటుకు నోటు వ్యవహారంలో సిబిఐ విచారణ చేయించాలని కాంగ్రెస్ ఎంపి విహన్మంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆయన ఢిల్లీలో ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలసి రేవంత్ వ్యవహారంపై చర్చించారు. ఓటుకు నోటు కేసులో కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ముడుపుల వ్యవహారంపై పూర్తి విషయాలు రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించానన్నారు. ఎన్డీఏతో టీడీపీ పొత్తు పెట్టుకున్నది కాబట్టే టీడీపీ తప్పు చేస్తే ఎన్డీఏ కూడా తప్పు చేసినట్లు అవుతుందని వివరించానన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు నోరు మెదపడం లేదు. ముడుపుల వ్యవహారంపై సీబీఐ చేత విచారణ చేయించాల్సింది కోరినట్లు ఆయన పేర్కొన్నారు. దొరికినోడు దొంగ అన్నట్లుగా అసలు దోషులు బయటకు రావాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉందన్నారు. దీనిపై సిబిఐ విచారణ జరిగితే నిజాలు నిగ్గుతేలుతాయన్నారు.