రేవంత్ మెడకు అడకత్తెర
రేవంత్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు
అసెంబ్లీ సభ్యత్వం రద్దుకు సర్కారు యోచన
న్యాయ నిపుణులతో సంప్రదింపులు
50 లక్షలు ఎలా వచ్చాయి? : ఉచ్చు బిగుస్తున్న ఐటీ
హైదరాబాద్,జూన్3(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో రేవంత& పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. చర్లపల్లి జైళ్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఐటీ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎమ్మెల్యేకు ఇవ్వజూపిన 50 లక్షల మొత్తం ఎక్కడిదని ప్రశ్నించేందుకు ఐటి అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. దీనికి అనుమతి వస్తే ఇక రేవంత్ చిక్కుల్లో పడ్డట్లేనని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపుతూ రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ రూ.50 లక్షలు రేవంత్‌రెడ్డికి ఎక్కడ నుంచి వచ్చాయని ఆదాయపు పన్ను శాఖా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈమేరకు ఈ కేసులో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహను విచారించడానికి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ కేసులో నిందితులను విచారించేందుకు తమకు అప్పగించాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు ఇతర నిందితులను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్న తర్వాత వారిని విచారించేందుకు తమకు కూడా అనుమతి ఇవ్వాలని ఐటీ అధికారులు కోరనున్నారు.
మరోవైపు రేవంత్ అసెంబ్లీ సభ్యంత్వం రద్దు చేసేందుకు ఉన్న అవకాశాలను టీయారెస్ సర్కారు పరిశీలిస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుశ్రీస్త్రల సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలావుంటే రేవంత్‌రెడ్డిని కలవడానికి బుధవారం టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, ప్రకాశ్‌గౌడ్ జైలుకు వెళ్లారు. ఎమ్మెల్యేలను కలవడానికి రేవంత్‌రెడ్డి ఇష్టపడలేదు. ఇద్దరు ఎమ్మెల్యేలను వెనక్కి పంపించారు. కాగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసు కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సైతం భాగస్వామిగా చేసేందుకు ఉన్న అవకాశాలపై టీఆర్‌ఎస్ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు పాత్రపైనా విచారణ జరపాలంటూ టీఆర్‌ఎస్ మంత్రులు, పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాబు మాట్లాడినట్లు ఆధారాలున్నాయని తెలంగాణ ¬మంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం వరంగల్‌లో అన్నారు. త్వరలో సంచలనాలు వస్తాయని అన్నారు. మరోవైపు బాబుపై కేసు నమోదు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అటు ఎపి, ఇటు తెలంగాణ నేతలు కూడా దీనిపై డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేసు కీలకమలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా విమర్శలకు పని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్‌ను కలిసిన సందర్భంలో చంద్రబాబు ప్రస్తావన తీసుకువచ్చారు. దీంతో ఈ కేసులోకి చంద్రబాబును కూడా లాగడంపై టీఆర్‌ఎస్ దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ కేసులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని, ఆయనపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరపాలని జగన్ గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఒక లేఖ ఇచ్చారు. త్వరలో ఇదే డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కూడా కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ పార్టీల డిమాండ్, ఒత్తిడి మేరకు చర్యలు తీసుకుంటారా అన్నది కూడా ఆలోచించాల్సి ఉంది.అందులో భాగంగానే జగన్ రంగంలోకి దిగి చంద్రబాబుపై చర్య తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబుపై చర్యకు కోర్టు నుంచి అనుమతి తీసుకోగలిగితే తమ పని మరింత సులువు అవుతుందని కూడా టీఆర్‌ఎస్ నేతలు ఆంతరంగిక సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు… రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, ఈ అంశాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ కేసు కూడా నమోదైతే చంద్రబాబును మరింత చిక్కుల్లోకి నెట్టవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను టీడీపీ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై మరో రాష్ట్రం కేసు నమోదు చేయాలని చూడటం అంత తేలిక కాదు. ఎక్కడో జరిగిన ఒక సంభాషణలో అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని మూడో వ్యక్తిపై కేసు నమోదు చేయడం కుదురుతుందా అన్నది న్యాయనిపుణలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చంద్రబాబుపై కేసు పెట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది.