రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ నుంచి సిట్‌ ఆఫీస్‌ వరకు పాదయాత్రకు టీటీడీపీ నేతలు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్న క్రమంలో పోలీసులు వారిని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తర్వాత వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.