రేషన్ కార్డు ఇవ్వని వారు..పథకాలు అమలు చేస్తారా? – బోగ శ్రావణి(జగిత్యాల బిజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి)

రాయికల్,నవంబర్ 21(జనంసాక్షి) మండలంలోని రామాజీపేట్, భూపతిపూర్ మరియు మూటపెళ్లి మరియు ఒడ్డెర కాలనీ గ్రామంలో గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన జగిత్యాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.బోగ శ్రావణి.
డబల్ బెడ్ రూమ్ ఇస్తానన్న కెసిఆర్ ఇవ్వలేదు. ఐదు లక్షలు ఇస్తానని ఇప్పుడు మూడు లక్షల మాత్రమే ఇస్తానని మోసం చేస్తున్నారు.
నరేంద్ర మోడీ గారు దేశమంతా పేదవారి సొంత ఇంటి కల నిజం చేస్తుంటే.. మోడీ గీడి అంటు మాట్లాడి ఇల్లు కట్టించకుండా మోసం చేస్తున్నారు.
తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి డబ్బులు ఏమి ఖర్చు కావు కదా..
కొత్తగా పెళ్లయి వేరే పడ్డ కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వాలి కదా. ఆ రేషన్ కార్డు కూడా పేదలకు ఎందుకు ఇవ్వలేదు అని మనం అడగాలా వద్దా?
మహిళలకు వడ్డీ పైసలు కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా ఇస్తుంది. కానీ రాష్ట్రం మాత్రం ఇవ్వడం లేదు.
పల్లెటూర్లలో ప్రకృతి వనం పేరుతో చెట్లు పెట్టే పైసలు కూడా కేంద్రమే ఇస్తుంది. మీ ఊర్లో వేసిన సిమెంట్ రోడ్లు, మోరీలు, గ్రామపంచాయతీ భవనాలు, చెట్లు పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవి.చివరికి మనకు వచ్చే బియ్యం కూడా నరేంద్ర మోడీ గారు ఐదు కిలోల చొప్పున రూపాయి ఖర్చు లేకుండా పంపిస్తున్నారు. ఇంకో ఐదు ఏళ్ళు కూడా పంపిస్తా అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ మండల అధ్యక్షుడు అన్నవేని వేణు ఎంపీటీసీ ఆకుల మహేష్,పట్టణ అధ్యక్షులు చిలువేరి నాగరాజు,బూత్ అధ్యక్షులు ఇనుగంటి నాగరాజు,ఇద్దాం గంగారెడ్డి, మండల ఉపాధ్యక్షులు కొల శంకర్, ఆనంద్ గౌడ్,ప్రేమ్,భూమేష్,రాజు,నందుతిరుపతి,లక్ష్మి పతి,రమేష్, లక్ష్మణ్ హిందూ సేన యూత్,శివసేన యూత్,ఫ్రెండ్స్ యూత్ సభ్యులు వేణు,ప్రధాన కార్యదర్శి రాజశేఖర్,సింగిల్ విండో చెర్మెన్ ఏనుగు ముత్యం రెడ్డి,కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మి నారాయణ,గ్రామ శాఖ అధ్యక్షుడు సంకోజి శేఖర్,గ్రామ నాయకులు ఇలాటి రమేష్,నెతుల లక్ష్మి నారాయణ రెడ్డి,మహేష్,వెంకటేష్,జెలెందర్,
వార్డ్ మెంబర్స్ సునీత,లావణ్య,లావణ్య, నాయకులు కార్యకర్తలు నాయకులు యువకులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.