రేషన్ ….. పరేషాన్. నల్ల బజార్ కు తరలిపోతున్న రేషన్ బియ్యం
* మామూళ్ల మత్తులో అధికారులు.
.
ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ప్రభుత్వాలు పేదవారి కోసం కిలో ఒక్క రూపాయికే రేషన్ బియ్యం అందిస్తున్న విషయం ఇదితమే. కానీ రెవెన్యూ అధికారుల పుణ్యమా అని భూస్వాములకు తెల్ల రేషన్ కార్డులు ఉండడంతో రేషన్ బియ్యాన్ని తినడం మానేసి బయటి మార్కెట్కు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారు. ఇదే అదునుగా చేసుకొని కొంత మంది రేషన్ మాఫియా అక్రమార్కులు అక్రమ వ్యాపారాలకు తెర లేపారు. అందుకోసం గ్రామాలలో ఏజెంట్లను తయారు చేసి రేషన్ బియ్యాన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఒకచోట స్టాక్ పాయింట్ని ఏర్పాటు చేసుకున్నారు.అందులో జిల్లా కేంద్రం లో ని తాంసీ బస్టాండ్ ప్రాంతం లోని ఓ ప్రయివేట్ జీన్నింగ్ లో భారీగా డంపింగ్ చేసినట్లు విశ్వాసనియా సమాచారం. అటు అధికారులకు మామూలు ఇస్తూ రేషన్ మాఫియాను ఇష్టానుసారంగా అక్రమార్కులు నిర్వహించడం గమనార్హం. రేషన్ కార్డు అల్లా ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని మాఫియా రీసైక్లింగ్ చేస్తూ పాలిష్ వేసి నూకగా తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు.. రూపాయి బియ్యం రీసైకిలింగ్ చేసి రేషన్ మాఫీ దాదాపు 30 నుండి 40 రూపాయలకు కేజీ అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు గడిస్తున్న అధికారులకు మాత్రం చీమకుట్టినట్లుగా కూడా లేదు. ఈ రేషన్ మాఫియా అధికారులు కనుసనల్లోను జరుగుతుందని పలు విమర్శలు వెలువేత్తు తున్నాయి. వేలాది రూపాయల్లో మామూలు అందుతున్నాయన్న విమర్శలు కోకొల్లలు. అయితే ఇచ్చోడ. ఇంద్రవెల్లి. తాంసీ. భీంపూర్. తలమడుగు మండలాలలో అధికారులకు నెల నెల ఎంతో కొంత మామూళ్లు ముట్ట చెపుతున్నట్లు విశ్వసనియా సమాచారం. ఇలా అధికారులు రేషన్ మాఫియాను అదుపు చేయాల్సింది పోయి మామూలు తీసుకుంటూ మేమున్నాం మీరు ఏదైతే వ్యాపారాలు చేసుకోండని వత్తాసు పలకడం ఏంటని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విజిలెన్స్ సివిల్ సప్లై అధికారులు అక్రమ రేషన్ మాఫియా పై కొరడా జు లిపించి అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని రేషన్ మాఫియాకు చరమగీతం పాడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Attachments area