రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

3

సీఎం విహార యాత్రలా.. ప్రత్యేక విమానంలో పర్యటనలా

మండిపడ్డ ఉత్తమ్‌ కుమార్‌

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌7(జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కరువు కాలంలో సిఎం కెసిఆర్‌ విహార యాత్రలు చేస్తున్నారని అన్నారు. ఆయనకు రైతులంటే లఅక్ష్యం లేదన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో కరవు, మంచినీటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చైనా పర్యటన వల్ల రాష్టాన్రికి ఎలాంటి లాభం ఉండదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కరువు రాజ్యమేలుతుంటే కేసీఆర్‌ విహారయాత్రలు, ప్రత్యేక విమానంలో పర్యాటనలు చేస్తున్నారని విమర్శించారు. రైతును రక్షిద్దాం అనే నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహాబూబ్‌నగర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రస్‌ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.  కేసీఆర్‌ చైనా పర్యటనతో తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన ఎద్దేవాచేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరువుపై వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజకీయాలను టీఆర్‌ఎస్‌ భ్రష్టు పట్టించిందన్నారు. కేసీఆర్‌ ఆకాశంలో విహరిస్తూ పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో తొందరపాటు నిర్ణయాలతో పాలన అస్తవ్యస్తమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార అహంకారానికి కేసీఆర్‌ నిదర్శనంగా నిలిచారని జైపాల్‌రెడ్డి ఎద్దేవాచేశారు. మా ఎమ్మెల్యేపై దాడి వెనుక సీఎం ప్రోత్సాహముందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. కరువు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొత్త జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చారని అరుణ మండిపడ్డారు. అంతకుముందు మహబూబ్‌నగర్‌ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని, రైతు ఆత్మహత్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తకుమార్‌రెడ్డికి షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో పొత్తూరు మండలం జిల్లా ముఖద్వారం తిమ్మపూర్‌ వద్ద ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, ఎంపీపీ శివశంకర్‌ గౌడ్‌, మాజీ మార్కెట్‌ లద్ఘిర్మన్‌ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.