రైతుబంధుతో సంక్రాంతి సంబరాలు
` ఉత్సవాల పొడిగింపు
` మంత్రులు కేటీఆర్,నిరంజన్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్,జనవరి 8(జనంసాక్షి):సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు సంబరాలుతెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల పదవ తారీకు వరకు కొన్ని పరిమితుల ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్ నిబంధనల మేరకు ర్యాలీలకు, ఊరేగింపు అనుమతి లేని నేపథ్యంలో ఈ నిర్ణయంసంక్రాంతి వరకు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ రైతు బంధు ఉత్సవాలు జరుపు కోవాలని సూచించారు.రైతుబంధు ఉత్సవాల సందర్భంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు.కాగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల్లో తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రం ఆవిష్కృతం అయిందన్నారు.సమైక్య పాలనలో రైతుల కష్టాలు, కేసీఆర్ పాలనలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్లు విద్యార్థులు వెల్లడిరచారుగ్రామాల్లో సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు సంబరాలుఈ నెల 10 వరకు అనుకున్న సంబరాలు సంక్రాంతి వరకుకోవిడ్ ఆంక్షల అనుగుణంగా జరుపుకోవాలని రైతు సోదరులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్ నిబంధనల మేరకు ర్యాలీలకు, ఊరేగింపు అనుమతి లేని నేపథ్యంలో ఎక్కడికక్కడ నిబంధనల మేరకు జరుపుకోవాలని సూచించారు.