రైతులకు కార్పొరేట్‌ తరహా లాభాలు రావాలి

` రైతును రాజును చేయడమే మాలక్ష్యం.. ఇదే నా కల
` దావోస్‌ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
` టాటా గ్రూపుతో స్కిల్‌ సెంటర్లపై ఒప్పందం
హైదరాబాద్‌(జనంసాక్షి): రైతులకు కార్పొరేట్‌ తరహాలో లాభాలు రావాలన్నదే తన స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశంలో ’ఆహార వ్యవస్థలు, స్థానిక చర్యలు’ సదస్సు జరిగింది. ఇందులో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. భారత్‌లో రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్య అన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు రావు, ఆధునిక టెక్నాలజీ లేదన్నారు. రైతులకు సరైన లాభాలు రావడం లేదని.. తెలంగాణలో మాది రైతు ప్రభుత్వమని చెప్పారు. రైతు భరోసా ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నామన్నారు. రైతులకు కార్పొరేట్‌ తరహా లాభాలు రావాలనేదే నా స్వప్నమని.. లాభాలు వస్తే రైతు ఆత్మహత్యలు 99శాతం ఉండడవన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అవసరమని, ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు స్థిరమైన మోడల్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని.. రైతులు ఎప్పుడూ ప్రపంచానికి సహాయం చేస్తూనే ఉన్నారని.. ఇప్పుడు ప్రపంచం రైతులకు అండగా నిలువాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్‌ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్‌ ట్రైనర్ల నియామకానికి రూ.1500 కోట్ల పెట్టబడులు పెట్టనుంది. దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సులో టాటా సన్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. ఇప్పటికే వివిధ రంగాల్లోవిస్తరించిన టాటా గ్రూప్‌ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలపై చర్చించారు. టీ రంగంలో టాటా కన్‌స్టలెన్సీ సర్వీసెస్‌ హైదరాబాద్‌ లోని అతి పెద్ద ఐటీ కంపెనీలలో ఒకటి.ఇందులో 80 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. రాబోయే కొన్నేళ్లలో టీసీఎస్‌ మరింత వృద్ధి చెందనుంది. టాటా అడ్వాన్స్‌ డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఇప్పటికే గ్లోబల్‌ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగంలో పలు ప్రాజెక్టులు చేపట్టింది. బోయింగ్‌, సికోర్స్‌ కీ, జిఇ, లాక్‌హీడ్‌ మార్టిన్‌ వంటి కంపెనీలతో కలిసి పెట్టుబడులు పెట్టింది. ªూష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌ డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌ గ్రేడ్‌ చేసేందుకు టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టు చేపడుతోంది. లాంగ్‌ టర్మ్‌, షార్ట్‌ టర్మ్‌ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్నితగ్గించే బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తుంది. కొత్త కోర్సులకు పెట్టుబడులు పెడుతుంది. టాటా గ్రూప్‌ కు చెందిన ఎయిర్‌ ఇండియా విస్తరణలోనూ హైదరాబాద్‌ ను ట్రాన్సిట్‌ హబ్‌ గా ఎంచుకోనుంది. హైదరాబాద్‌ నుంచి డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ విమానాల కనెక్టివిటీని పెంచనుంది. తెలంగాణ అభివృద్ధికి టాటా గ్రూప్‌ కీలకమైన భాగస్వామ్యం అందిస్తోందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అన్నారు. వివిధ రంగాలలో పెట్టబడులు పెడుతున్న టాటా గ్రూప్‌ నకు తగిన సహకారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ ఐటీఐలలో అధునాతన నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు టీటీఎల్‌ బాగస్వామ్యం పంచుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీలను నెలకొల్పేందుకు చొరవ చూపాలని సీఎం టాటా గ్రూప్‌ ను స్వాగతించారు. మ గ్రూప్‌ పెట్టుబడులకు తెలంగాణ వ్యూహత్మకమైన కేంద్రంగా ఉందని, వీలైనంత మేరకు రాష్ట్రంలో
తమ గ్రూప్‌ వ్యాపారాలను రాష్ట్రంలో విస్తరిస్తామని టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేయాలనే ఆసక్తితో ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం. ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్‌ బాబు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్రమోషన్‌ స్పెషల్‌ సెక్రెటరీ విష్ణువర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

తెలంగాణలో 09 సొల్యూషన్స్‌
` సప్లైచైన్‌ స్కిల్స్‌ అకాడమీ ఏర్పాటు
హైదరాబాద్‌(జనంసాక్షి): 09 సొల్యూషన్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, దాని గ్లోబల్‌ క్లయింట్‌ల కోసం సప్లై చైన్‌ స్కిల్స్‌ సామర్థ్యాన్ని పెంపొందించడానికి హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించనుందని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశం లో నీ9 సొల్యూషన్స్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. ప్రస్తుతం తయారీ, రిటైల్‌ రంగాలలో సప్లై చైన్‌ స్కిల్స్‌ గ్లోబల్‌ డిమాండ్‌ ఉన్న నేపద్యం, స్కిల్స్‌ పెంపొందించుకోడానికి ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ కు ఉపయోగపడుతుంది. ఇందులో పరిశ్రమ, డొమైన్‌ పరిజ్ఞానం, ఉత్పత్తి నిర్వహణ, ంఎ ఇతర సాంకేతిక నైపుణ్యాలలో శిక్షణ అందించబడుతుంది, స్థానిక ఇంజినీర్లు గ్లోబల్‌ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను సాధించే విధంగా ఇక్కడ శిక్షణనివ్వనున్నారు. నీ9 సోలుషన్స్‌ పరిశ్రమకు కావాల్సిన డొమైన్‌ తయారీ నిపుణులను అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ఫిజికల్‌ ట్రైనింగ్‌ కోసం అవసరమైన మౌలిక వసతులను ను సమకూరుస్తుంది. ఈ సందర్భంగా ప్రత్యేక సప్లై చైన్‌ స్కిల్స్‌ అకాడవిూ ఏర్పాటుకు ముందుకు వచ్చిన నీ9 సొల్యూషన్స్‌ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అకాడవిూ ఏర్పాటు వల్ల యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని నీ9 సీఈఓ శ్రీ చక్రి గొట్టెముక్కల ఆశాభావం వ్యక్తం చేసారు. ఎుఇడఅ, ఎడఅ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీ జయేష్‌ రంజన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

(హైదరాబాద్‌లో ఉబెర్‌ సేవల విస్తరణ
` దావోస్‌లోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కంపెనీ ప్రతినిధి బృందం చర్చలు
హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఉబర్‌ కంపెనీ హైదరాబాద్‌ లో తమ సేవలను విస్తరించనుంది. దావోస్‌లోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఉబెర్‌ ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. ఉబర్‌ కంపెనీ అమెరికా తర్వాత అతి పెద్ద టెక్‌ సెంటర్‌ ను హైదరాబాద్‌ లోనే నిర్వహిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ ద్వారా తమ మొబిలిటీ కార్యకలాపాలను మరింత విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో సుమారు 1000 మంది ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది. హైదరాబాద్‌లో రెండు వినూత్న సేవలను పరిచయం చేయాలని ఈ కంపెనీ నిర్ణయించింది. ఉబెర్‌ గ్రీన్‌ పేరుతో జీరో`ఎమిషన్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ రైడ్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుంది. ఎక్కువ కెపాసిటీ ఉన్న వాహనాలపై ప్రీమియం, సమర్థమైన రైడ్‌లను అందించడానికి ఉబెర్‌ షటిలో సర్వీస్‌ ను ప్రవేశపెట్టనుంది. తెలంగాణలో పర్యావరణ సంరక్షణ బాధ్యతగా తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఉబెర్‌ విస్తరణ, హైదరాబాద్‌లో కంపెనీ కొత్త సేవలతో రాష్ట్రంలో మొబిలిటీ మరియు ఆటోమోటివ్‌ రంగం వృద్ధి చెందనుంది.