రైతులకు నష్టం చేస్తే సహించం

3
– సొనియా

– మేడ్‌ ఇన్‌ ఇండియా కాదు టేక్‌ ఇన్‌ ఇండియా : రాహుల్‌

న్యూఢిల్లీ  సెప్టంబర్‌ 20(జనంసాక్షి):

భూసేకరణ ఆర్డినెన్స్‌ వ్యతిరేకంగా రైతులు జరిపిన పోరాటానికి నరేంద్రమోదీ ప్రభుత్వం తలొగ్గిందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌ కిసాన్‌ సమ్మాన్‌ ర్యాలీ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సోనియాగాంధీ మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.    పోరాటం ఇంకా ముగియలేదన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులకు నష్టం చేసే.. అభివృద్ధికి మేం వ్యతిరేకం అని తెలిపారు. విదేశీ పర్యటనలకు, కార్పొరేట్‌లను కలిసేందుకు సమయం ఉంది కానీ.. రైతుల సమస్యలు వినేందుకు మోదీకి సమయం లేదా? అని సోనియాగాంధీ ఈ సందర్భంగా

దుయ్యబట్టారు.కాంగ్రెస్‌ కిసాన్‌ సమ్మాన్‌ ర్యాలీ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ల్యాండ్‌ బిల్లును కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ప్రజావిజయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల్లో కూడా ల్యాండ్‌ బిల్లులు ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించినది..మేక్‌ ఇన్‌ ఇండియా కాదు.. మోదీ జీ కా టేక్‌ ఇన్‌ ఇండియా అని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఇబ్బందులే ఉన్నాయని ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించటానికి మోదీకి సమయమే దొరకట్లేదా? అని రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తాను కూడా రైతునే అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. రైతు సమస్యలకు పరిష్కారం మాట దేవుడెరుగు అసలు అన్నదాతల సమస్యలు వినే తీరిక కూడా ప్రధాని మోడీకి లేదని కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ మండిపడ్డారు. దేశానికి రైతే రాజు అని గొప్పులు చెప్పే పాలకులంతా అన్నదాతల వైపు చూసేందుకే ఇష్టపడటం లేదని నిప్పులు చెరిగారు. రైతు శ్రేయస్సు లేకుంటే దేశం అంధాకరమవుతుందని, మోడీ భూమి తీసుకోవడం లేదని, ఒక అమ్మను దోచుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. మోదీ లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన తరహాలో ఇప్పుడూ ఇస్తున్న బూటకపు హావిూలకు మోసపోవద్దని సూచించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సూటు, బూటు తొడుక్కునే ఆయన స్నేహితులు ఢిల్లీ, గుజరాత్‌ల నుంచి కొత్త భూసేకరణ బిల్లు కింద రైతుల భూమి తీసుకోవటానికి బిహార్‌కు వస్తారు.. వారి కోర్కెలను ఎన్‌డీఏ ప్రభుత్వం తీరుస్తుంది అని అన్నారు. ఉపాధి సృష్టి గురించి, పరిశుభ్రత గురించి సూటు, బూటు స్నేహితుల వద్ద గొప్పలు చెప్పుకోకుండా సఫాయి కార్మికుల వద్దకు, నిరుద్యోగ యువత వద్దకు వెళ్లాలన్నారు. ఈ సభలో పాల్గొన్న వారిలో ఎవరూ సూటు, బూటు వేసుకోలేదని చెప్తూ తమ కూటమి పేదల కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు.