రైతులకు నిరంతరం విద్యుత్తు అందించాలి
భద్రాచలం టౌన్: రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. భద్రాచలంలో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌కల్టెర్ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు తిలక్ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయాలని, విద్యుత్తు కోతలు ఎత్తివేయాలని , పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాల నర్సారెడ్డి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.