రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. -జిల్లా కలెక్టర్ కె శశాంక, రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి.

రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ ఆర్ధికంగా బలోపేతం కావాలని  జిల్లా కలెక్టర్ కె. శశాంక, రాష్ట్ర ఆయిల్ఫెడ్ సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి లు అన్నారు. బుధవారం మధ్యాహ్నం కురవి మండలం కొత్తూరు( సి) గ్రామంలో 20 ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్న డాక్టర్ ఇంద్రసేనారెడ్డి తోటలో దిగుబడి జిల్లాలో ప్రథమంగా గెలలు కోతకు వచ్చిన సందర్భంగా పరిశీలించుటకు గాను జిల్లా కలెక్టర్ కె. శశాంక  టి.ఎస్.ఆయిల్ ఫెడ్ చైర్మన్ తో కలిసి సందర్శించి కోతకు వచ్చిన గెలలను కట్ చేశారు.  గెల సుమారు 8కిలోల నుండి 10 కిలోల బరువు ఉందని, మరింత అవగాహన కల్పించుకుని, ఫామ్ ఆయిల్ సాగును చేయాలని అన్నారు. ఈ సంవత్సరం మహబూబాద్ జిల్లా లో 6 వేల ఎకరాల్లో సాగు చేయబోతున్నామని, లేబర్ సమస్య ఉండదని, శ్రమ తక్కువని, ఆరుతడి పంట అయినందున నీటి శాతం కూడా తక్కువగా ఉంటుందని, 4 లక్షల మొక్కలు హరిపిరాల నర్సరీలో అందుబాటులోకి తీసుకు వస్తున్నామని, ఒక ఆయిల్ఫామ్ కె ఆక్ట్ ఉందని , రైతు కు అందజేసిన మొక్కల్లో చనిపోయిన, గెలలు రానీ వాటికి, రీప్లేస్మెంట్ ఇస్తామని, 3 సం,,రాలు వాటిని కంటికి రెప్పలా కాపాడుకోగల్గితే 30 సంవత్సరాలు సరిపడా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని, 1ఎకరానికి 1లక్షా 50వేల దిగుబడి పొందవచ్చునని, ఒక చెట్టుకు 10 నుండి 14 గెలలు కాస్తున్నాయని, ఈ గెలలు 3నెలల ముందే చేతికి వచ్చాయని, కొత్త పంట అయినందున పూర్తి పర్యవేక్షణ ఉండాలని,1 ఎకరానికి 12 నుండి 15 టన్నుల గెలలు తీయవచ్చని, ఈ పంటకు కేంద్ర అనుమతి పొందాల్సిన అవసరం ఉన్నదని, మూడు సార్లు తిరక్షరించగా, 4వ సారి సర్వేలో 8 జిల్లాల్లో అనుకూలమని గుర్తించగా ఇప్పుడు 32 జిల్లాల్లో సాగు చేయుటకు సబ్సిడీ అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, పైలెట్ ప్రాజెక్టుగా 1వేయి ఎకరాలకు సాగు సాగు చేశామని, గతంలో అశ్వరావుపేట నుండి మొక్కలు దిగుమతి చేసుకునేది అని, ఇప్పుడు మన జిల్లాలోనే సీడ్ ను పెట్టుకున్నామని, మనదేశంలో 22 మిలియన్ టన్నుల వంట నూనె అవసరం ఉండగా, ఏడు మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుందని, మిగతావి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని, వంటనూనె కొరత తీరాలంటే 70 సంవత్సరాలు ముందుకు వెళ్లాలని ప్రతి రైతు దీర్ఘ ఆలోచన చేయాలని, వేరుశెనగ, నువ్వులు పొద్దుతిరుగుడు, ల్లో వచ్చే నూనె శాతం కంటే 75 ఆయిల్ ఫామ్ సాగులో వస్తుందని అన్నారు. హరిపిరాల ప్రాంతంలో 110 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, సుమారు 30 నుండి 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు మొక్కలను పెంచుతున్నామని, మిగిలిన 70 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి ప్రపోజల్స్ చేస్తున్నామని, 25 నుంచి 35 ఎకరాల్లో జిల్లాలో ఆయిల్ఫామ్ సాగు చేస్తేనే ఫ్యాక్టరీ కల సహకారం అవుతుందని, మరింత మందికి ఉపాధి పొందే అవకాశం ఉందని, వరి వేస్తే రైతుకు క్వింటా 8250 రూపాయల తో బియ్యానికే 63% రేటు కట్టి ఇస్తున్నారని, ఆయిల్ ఫామ్ కు 23476 రూపాయలు 1 టన్ను కు చెల్లి ఇస్తున్నామని, ఆయిల్ రికవరీ మీదనే కాకుండా గింజ నుండి కూడా ఆయిల్ వస్తుందని, ఓ ఈ ఆర్ ఉత్పత్తి పై 75.25% రైతుకు వాటా కల్పించడం జరుగుతుందని, ఇది గొప్ప విషయమని రైతు అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, రసాయన ఎరువులను తగ్గించుకోవాలని, చెట్టు మట్టలు, మిల్లులో వచ్చే పీచు పదార్థాలు ఎరువులుగా ఉపయోగపడు తున్నాయని, రీసెర్చ్ సెంటర్లో తెలంగాణ నుండి 80 మంది ఫీల్డ్ ఆఫీసర్ లను శిక్షణ ఇప్పించడం జరిగింది అని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు బ్యాంకు లోన్ లు కూడా అందించడం జరుగుతుందని, ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో గుంతలు తీయుటకు చర్యలు చేపడుతున్నామని, చిత్తశుద్ధితో మొక్కలను వేసవిలో కూడా కాపాడగలిగే ఎంత ఉతమిస్తే అంత ముందుకు సాగును తీసుకుపోగల మని, మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, మన దేశంలో 19 రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారని, నెంబర్ వన్ గా తెలంగాణ నడుస్తుందని, ఓ సి ఆర్ శాతంతో 19.28 తో ఆయిల్ రికవరీ శాతo లో మన రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు. గతంలో 300 కోట్లు ఉన్నది 1100, 5 లక్షలు ఉండగా 55 లక్షలు గణనీయంగా మొక్కలను పెంచుతున్నామని, రైతులు ఆర్థికంగా బలపడుతూ ప్రభుత్వ సంస్థలను కాపాడే బాధ్యత మనపై ఉందని,1 పామాయిల్ గింజ ఖరీదు 80 రూపాయలు ఉంటుందని,1 లక్ష మొక్కల్లో85 వేల మొక్కలు ఖచ్చితంగా చేతికి వస్తాయని 1 ఎకరానికి 50 మొక్కలు మాత్రమే నాటాలని ఖరీప్ లో 6వేల ఎకరాల్లో 11 వందల మంది రైతులు సాగుచేస్తున్నారని, జిల్లా శాతం చూడగా4 లక్షల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉందని రైతులు ఆలోచించి ఆయిల్ ఫామ్ సాగు పంటపై మరింత అవగాహన కలిగించుకోవాలని, ఫుడ్ ఇండస్ట్రీ ఎప్పటికీ నష్టం చేకూరదని అవగాహన సదస్సులో కలెక్టర్, ఆయిల్ఫెడ్ చైర్మన్ లు పలు అంశాలపై సాగుచేస్తున్న, సాగు చేయబోవు రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. 20 ఎకరాలు వేసిన రైతు అనుసరించిన విధానం, అనుభవాలను అడుగగా రైతు యానాల ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ, 3 సంవత్సరాల కిందట, ఫుల్ కాస్ట్ లో మొక్కలను 33 రూపాయలతో కొన్నానని, ఆరుతడి పంట అని, 3నెలల ముందే కాయ కోతకు వచ్చిందని, 10 నుంచి 14 గెలల వరకు వెళ్తున్నాయని,8నుండి10 కేజీల బరువు వస్తున్నాయని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, చైర్మన్లు ఫార్మర్ కార్డు, సర్టిఫికెట్ను శాశ్వత షీల్డ్ శాలువాతో ప్రయోగాత్మకంగా 20 ఎకరాల్లో పంట సాగు చేసినందుకు రైతు డాక్టర్ ఇంద్రసేనా రెడ్డి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ,  తహసిల్దార్ ఇమ్మాన్యుయేల్, ఎంపీడీవో సరస్వతి, సంబంధిత అధికారులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.